Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2016 11:50:24
facebook Twitter Googleplus
Photo

బ్రూస్ లీ మూవీలో రామ్ చరణ్ కి అక్కగా నటించిన కృతి కర్బందా.. కన్నడ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్. ఇప్పుడీ భామ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా అరంగేంట్రం చేసేస్తోంది. ఇమ్రాన్ హష్మీకి జోడీగా రాజ్ రీబూట్ తో బాలీవుడ్ లోను.. జీవీ ప్రకాష్ కి జంటగా బ్రూస్ లీ చిత్రంతో తమిళ్ లోను ఎంటర్ అయిపోతోంది కృతి. సాధారణంగా బాలీవుడ్ సినిమాల కోసం అన్నీ వదులుకుని పరిగెట్టే హీరోయిన్స్ చాలామందే ఉంటారు. కానీ నేను చాలా డిఫరెంట్ అంటోంది ఈ బ్యూటీ.

'నేను ఎట్టి పరిస్తితుల్లోనూ సౌత్ సినిమాలను వదిలిపెట్టను. దక్షిణాది ఫిలిం మేకర్స్ కి.. నా కమిట్మెంట్స్ కి కట్టుబడే ఉంటాను. సౌత్ సినిమాలతో డేట్స్ విషయంలో క్లాష్ రానప్పుడు మాత్రమే బాలీవుడ్ మూవీస్ అంగీకరిస్తాను' అని చెబుతూ ఆశ్చర్యానికి గురి చేసింది కృతి కర్బందా. నిజానికి మొదట్లో ఇలాంటి కబుర్లు అందరూ చెబుతారు కానీ.. కాస్త క్రేజ్ వచ్చాకే రూట్ మార్చేస్తారు. మరి నేనలా కాదు అని ముందే చెబుతున్న కృతి ఏం చేస్తుందో తెలియాలంటే రాజ్ రీబూట్ వరకూ ఆగాలి మరి.

ఇదిలా ఉంటే.. అసలు బాలీవుడ్ ఆఫర్ అందుకోవడంలో తన డేట్స్ చూస్తున్న ఏజన్సీ యాక్టివ్ పార్ట్ పోషించిందని చెబుతోంది కృతి. వాళ్లు ఫోటోగ్రాఫ్స్ పంపితే ఆడిషన్ కు పిలుపు వచ్చిందట. ఆ తర్వాత ఆఫర్ అందుకున్నానని చెబుతోంది కృతి కర్బందా.

,  ,  ,  ,  ,  ,