Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jul-2017 11:31:51
facebook Twitter Googleplus
Photo

నాని ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. ఇప్పటివరకూ వరుసగా అర డజన్ సక్సెస్ లు పూర్తి చేసి.. మూడో హ్యాట్రిక్ మొదలుపెట్టేశాడు. విజయాలు సాధించడం నానికి చాలా అలవోకగా మారిపోయింది. ఇంతటి గుర్తింపును సంపాదించేందుకు ఎంతో కష్టపడ్డాడు నాని. అయితే.. ఈ హీరో న్యాచురల్ స్టార్ అయేందుకు ముందు చాలానే కష్టాలు పడ్డాడు. వాటన్నిటికీ తగిన ఫలితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు.

నానిని అభిమానించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఆ విషయం నాని సినిమా ఓపెనింగ్ వసూళ్లలోనే కనిపిస్తోంది. తాజాగా నాని గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. 'ఈ తరంలోని అద్భుతమైన నటుల్లో నాని కూడా ఒకరు. ఈ వీకెండ్ లో నాని నటించిన కొన్ని సినిమాలు చూసి ఎంతో ఎంజాయ్ చేశాను. బ్రిలియంట్ పెర్ఫామర్' అంటూ ట్వీట్ చేసి నానిని ప్రశంసించారు కేటీఆర్. సినిమా రంగంతో సన్నిహితంగా ఉండే ఈయన.. పలు సినిమా ఫంక్షన్స్ కు కూడా హాజరవుతూ ఉంటారు. సినిమాలపై మక్కువను కూడా చాటుతూ ఉంటారు.

తనకు నచ్చిన విషయాన్ని.. తాను మెచ్చిన అంశాన్ని ఓపెన్ గా చెప్పేసే కేటీఆర్.. నాని నటనపై పొగడ్తల వర్షం కురిపించారు.

,  ,  ,  ,