Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2016 12:04:53
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం సినీ పరిశ్రమకు అతి సన్నిహితంగా మెలిగే వ్యక్తుల్లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. సినిమా పరిశ్రమ మంచి చెడ్డల నుంచి.. ఇమేజ్ లో వారితో పోటీ పడగలగడం కేటీఆర్ కెపాసిటీకి నిదర్శనం. అలాగే తను ఎంత బిజీగా ఉన్నా.. మంచి సినిమాలను చూడ్డం కూడా ఆయనకు అలవాటు. రీసెంట్ గా విడుదలైన కోలీవుడ్ మూవీ 24 ను కేటీఆర్.. ట్విట్టర్ సాక్షిగా ప్రశంసలు కురింపించారు.

'ఇప్పుడే 24 ను చూశాను. బ్రిలియంట్ స్క్రీన్ ప్లే - అద్భుతమైన పెర్ఫామెన్స్. నా కూతురు - కొడుకు 24 మూవీని ఇప్పుడే చూడాలంటున్నారు' అంటూ ట్వీట్ చేశారు కేసీఆర్. అంతే కాదు.. తనతో సూర్య దిగిన ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారాయన. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కాలాన్ని ఆపేయడం ముందుకు వెనక్కు తిప్పడం అనే ఎలిమెంట్ ను ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు.

సూర్య చేసిన మూడు పాత్రలు వేటికవే విభిన్నంగా ఉండడం గ్రాఫిక్స్ మాయాజాలాన్ని అద్భుతంగా చూపించగలగడం.. కన్ఫ్యూజన్ కు గురయ్యే కాన్సెప్ట్ ని వివరంగా చూపించడం.. దర్శకుడి ట్యాలెంట్ కి నిదర్శనాలు. తమిళ్ డబ్బింగ్ మూవీ అయినా.. కోలీవుడ్ కి పోటీగా 24 తెలుగు వెర్షన్ కు కలెక్షన్స్ వస్తుండడం విశేషం.

,  ,  ,  ,  ,  ,