Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jul-2017 11:13:03
facebook Twitter Googleplus
Photo

సొంతింటికి అయినా దూరం అవుతారేమో కానీ.. మీడియాను వదిలిపెట్టడం అసాధ్యం. ఎందుకంటే.. మీడియా వాళ్లను వదలదు కాబట్టి అంతే. అయితే.. ఖుష్బూ మీడియాను కొన్నాళ్లు దూరం పెట్టాలని అనుకుంటోంది. కాకపోతే ఆమె ఉద్దేశ్యం సోషల్ మీడియా గురించి మాత్రమే.

గత కొన్ని నెలలుగా ఖుష్బూ పలు రకాల కారణాలతో విమర్శల పాలవుతోంది. సామాజిక సమస్యలపై.. హాట్ హాట్ ఇష్యూలపై స్పందించడం ఈమెకు అలవాటు. ఆ అలవాటు కారణంగానే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రాలింగ్ కు గురవుతోంది. తనకు తోచిన విధంగా రియాక్ట్ కావడం.. వాటిని జనాలు డిఫరెంట్ గా రిసీవ్ చేసుకోవడం కారణంగా.. ఖుష్బూకు ప్రస్తుతం సోషల్ మీడియాపై బోర్ కొట్టేసింది. అందుకే కొంతకాలం పాటు ట్విట్టర్ కు దూరం కావాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఈమెకు 10 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి.. ఒక్కసారిగా ఇలాంటి డెసిషన్ తీసుకోవడంతో.. అభిమానులు షాక్ తినేశారు.

ఓకే ఫ్రెండ్స్.. కొంత కాలంపాటు ట్విట్టర్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. మళ్లీ పుస్తక పఠనం ప్రారంభిస్తా. ఈ ప్లాట్ ఫాం ఓ మత్తులాంటింది. అయితే. మళ్లీ వెనక్కి తిరిగి తప్పకుండా వస్తానని మాటిస్తున్నా అంటూ ట్వీట్ చేసిన తన ఉద్దేశ్యాన్ని చెప్పింది ఖుష్బూ.

,  ,  ,  ,  ,