Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 15:10:53
facebook Twitter Googleplus
Photo

మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం. 150 కొద్ది నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండడంతో, అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది.
ప్రస్తుతానికి ఈవారంలో ఓ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కించేందుకు ?ఖైదీ నెం 150? టీమ్ రెడీ అయిపోయింది. మొదట ఈ స్పెషల్ సాంగ్‌కు క్యాథరిన్ థ్రెసాను ఎంపిక చేసినా, తాజాగా లక్ష్మి రాయ్‌ను ఈ స్పెషల్ సాంగ్‌కు కన్‌ఫర్మ్ చేశారు. చిరుతో కలిసి లక్ష్మి రాయ్ ఈ స్పెషల్ సాంగ్‌లో పలు మాస్ స్టెప్పులేయనున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ?కత్తి?కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ?ఖైదీ నెం. 150?ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

,  ,  ,  ,  ,