Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 13:01:21
facebook Twitter Googleplus
Photo

లావణ్య త్రిపాఠి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ప్రారంభమైనా ఇప్పుడు కాసింత డల్ ఫేజ్ నడుస్తోంది. గతేడాది అంతా వరుస హిట్స్ తో సత్తా చాటిన ఈ భామ.. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా ఫ్లాపులనే ఫేస్ చేయాల్సి వస్తోంది. వరుణ్ తేజ్ తో నటించిన మిస్టర్.. శర్వానంద్ తో నటించిన రాధ.. నాగచైతన్యతో చేసిన యుద్ధం శరణం చిత్రాలు ఈ అందాల రాక్షసికి నిరాశనే మిగిల్చాయి.

అన్నీ క్రేజీ ప్రాజెక్టులే అయినా.. కంటిన్యూగా ఫ్లాప్స్ చేయాల్సి రావడం నిజంగా లావణ్య బ్యాడ్ లక్ అనాల్సిందే. అయితే.. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా అమ్మడి క్రేజ్ మాత్రం కాసింత కూడా తగ్గడం లేదు. ఇందుకు కారణం.. ఈ అమ్మడు లుక్ విషయంలో పక్కా తెలుగు అమ్మాయి అనదగ్గ స్థాయిలో ఉండడమే. అందుకే రీసెంట్ గా ఓ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా లావణ్య త్రిపాఠినే ఎంచుకున్నారు. ఇప్పటికే యాడ్ షూటింగ్ పూర్తయిపోగా.. తనపై పిక్చరైజ్ చేసిన ఈ యాడ్ ను లావణ్య స్వయంగా షేర్ చేసింది. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ను తాను ఎంతో విశ్వసిస్తానని.. అందుకే ఈ యాడ్ లో నటించానని చెబుతోంది లావణ్య త్రిపాఠి.

కంటెంట్.. కాన్సెప్ట్ కూడా తెలుగుదనంతో నిండిపోవడంతో.. లావణ్య త్రిపాఠి ఈ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ ప్రచారానికి సరైన ఆప్షన్ అనిపించకమానదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఉన్నది ఒకటే జిందగీ అంటూ హీరో రామ్ తో పాటు ఆడియన్స్ ను పలకరించనుంది లావణ్య.

,  ,  ,  ,  ,