Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 10:50:16
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో ఏ వంశానికి లేని రికార్డు అక్కినేని వారి ఖాతాలో ఒకటి ఉంది. అదే ఒకే హీరోయిన్ తో తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే హీరోయిన్ తో జోడీ కట్టడమే ఆ అరుదైన విషయం. అక్కినేని నాగేశ్వర్రరావుకి హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించిన అందాల తార శ్రీదేవి.. ఆ తర్వాత కాలంలో నాగ్ తోనూ జోడీ కట్టింది.

ఆఖరి పోరాటం.. గోవిందా గోవింద వంటి చిత్రాల్లో నాగ్ తో శ్రీదేవి చేసిన అల్లరి మర్చిపోవడం అంత తేలిక కాదు. అయితే.. ఇప్పుడు అక్కినేని క్యాంపులో మరీ శ్రీదేవి స్టార్ట్ అయిపోతోంది. ఆమె ఎవరో కాదు.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ఇప్పటికే అక్కినేని నాగార్జునతో కలిసి సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించింది లావణ్య. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెకకెక్కగా.. ఇప్పుడిదే దర్శకుడు నాగ్ తనయుడు నాగ చైతన్యతో తీయనున్న సినిమాలో.. మళ్లీ లావణ్యనే హీరోయిన్ గా తీసుకోనుండడం విశేషం. ఇప్పటికే ఓ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనల్ చేయగా.. మరో హీరోయిన్ పాత్రకు లావణ్యా త్రిపాఠిని ఓకే చేశారు. అక్కినేని తండ్రీ కొడుకులతో నటిస్తూ.. శ్రీదేవి తర్వాత ఆ రికార్డు పట్టేస్తోంది లావణ్య.

అందాల తార రికార్డును అందాల రాక్షసి కొట్టేస్తుండడం బాగానే ఉంది కానీ.. ఇలా తండ్రీ కొడుకులిద్దరి తోనూ నటిస్తున్న మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇప్పటికే రామ్ చరణ్ తో 4 సినిమాల్లో నటించిన చందమామ.. ఇప్పుడు మెగాస్టార్ తో కలిసి ఖైదీ నెంబర్ 150లో చిందులు వేయనుంది.

,  ,  ,  ,  ,