Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2015 10:38:57
facebook Twitter Googleplus
Photo

మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ అంటే తమిళ దర్శకుడు శంకర్ కి ప్రత్యేక అభిమానం. అలాంటి అందం మరొకరిలో లేదన్నది ఆయన అభిప్రాయం. అందుకే, ఇప్పటి వరకు ఆమెతో 'జీన్స్', 'రోబో' వంటి రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కూడా చేయడానికి ఆయన ఉవ్విళ్ళూరుతున్నాడు. 'ఐ' సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని అజిత్ తో చేయడానికి శంకర్ సన్నాహాలు చేసుకుంటున్న సంగతి విదితమే. ఈ ప్రాజక్టు గురించి ఇప్పటికే వీరిద్దరి మధ్యా చర్చలు కూడా జరిగాయి. కాగా, ఈ సినిమాలో కథానాయికగా ఐష్ ను తీసుకోవాలని ఈ దర్శకుడు డిసైడ్ అయ్యాడట. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెను కాంటాక్ట్ చేస్తున్నట్టు సమాచారం.

,  ,  ,  ,  ,