Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2016 12:25:53
facebook Twitter Googleplus
Photo

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కొత్త ప్రాజెక్టులపై ఈ మధ్య ఓ కొత్త కబురు వినిపించింది. శ్రీరస్తు శుభమస్తు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన మాయావన్(తమిళ్) చిత్రాన్ని.. తెలుగులో వరుణ్ తేజ్ కి జోడీగా మిస్టర్ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. ఇవి కాకుండా.. నాగ చైతన్య నెక్ట్స్ ప్రాజెక్ట్ లో లావణ్యను సెలెక్ట్ చేశారనే న్యూస్ గుప్పుమంది.

'హెలో.. హడావిడి క్లియర్ చేయడానికే చెబుతున్నా. కళ్యాణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ లో నేను చేస్తున్నానన్నది జస్ట్ రూమర్ మాత్రమే. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అంటూ చెప్పేసింది లావణ్య త్రిపాఠి. ఈ ఒక్క మాటతో చైతు- కళ్యాణ్ కృష్ణల ప్రాజెక్టులో తాను లేననే విషయాన్ని గట్టిగానే చెప్పింది లావణ్య. 'థాంక్యూ లావణ్య. నీ ఫ్యూచర్ ప్రాజెక్టులకు ఆల్ ది బెస్ట్.. త్వరలో మనం కలిసి పని చేస్తామని ఆశిస్తున్నా' అంటూ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆన్సర్ ఇచ్చాడు. లావణ్య చెప్పిన తర్వాత కూడా ఏదైనా డౌట్ ఉంటే.. అవి కూడా డైరెక్టర్ ట్వీట్ తో క్లియర్ అయిపోయినట్లే.

చేద్దాం చేద్దాం అంటూ.. లావణ్య మళ్లీ ఈ దర్శకుడికి ఆన్సర్ పెట్టడం విశేషం. తాము చేసే సినిమాల గురించి ట్వీట్స్ పెట్టినా పెట్టకపోయినా.. ఈ మధ్య హీరోయిన్లు తాము ఫలానా ప్రాజెక్టులో చెయ్యడం లేదని చెప్పడానికి మాత్రం ట్విట్టర్ ని తెగవాడేస్తున్నారు.

,  ,  ,  ,  ,