Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2015 11:23:48
facebook Twitter Googleplus
Photo

'కాంచన' సినిమాకి సీక్వెల్ గా తమిళ్ లో లారెన్స్ తెరకెక్కించిన 'కాంచన 2' అక్కడ ఘనవిజయానికి నిర్వచనం చెప్పింది. 'గంగ'గా తెలుగులోకి అడుగుపెట్టి ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. దాంతో ఇటు కథానాయకుడిగా .. అటు దర్శకుడిగా లారెన్స్ సక్సెస్ ని చేజిక్కించుకున్నాడు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఆయన వెంటనే మరో సినిమాకి రంగాన్ని సిద్ధం చేశాడు. ఫలితంగా ఆయన దర్శకత్వంలో ఆయనే కథానాయకుడిగా ఒక యాక్షన్ థ్రిల్లర్ కి రూపకల్పన జరుగుతోంది.

తమిళ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా చెప్పబడే 'వెందర్ ప్రొడక్షన్స్' బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతున్నట్టుగా స్వయంగా లారెన్స్ ప్రకటించాడు. కథానాయికలతో పాటు ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామనీ, ఆగస్టులో ఈ కథ సెట్స్ పైకి వెళుతుందని చెప్పాడు. మరి ఈసారి లారెన్స్ జోడీకట్టే నాయికలు ఎవరో .. ఆ కథలోని కమామిషు ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఎదురుచూడవలసిందే.

,  ,  ,  ,  ,