Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2016 12:05:51
facebook Twitter Googleplus
Photo

శేఖర్ కమ్ముల.. ఈ పేరు వినబడగానే మనకు ఆనంద్ నుండి హ్యాపీ డేస్ వరకు అన్నీ గుర్తొస్తాయి. కాని ఆ తరువాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అండ్ అనామిక అంటూ మనల్ని భయపెట్టిన సినిమాలు కూడా గుర్తొస్తాయి. అయితే ఈ సినిమాల పరాజయం తరువాత కమ్ముల కూడా కాస్త సైలెంట్ అయ్యాడు.

అప్పట్లో ఈ దర్శకుడు మహేష్ బాబుకు ఒక కథ చెప్పాడని.. ఇంకా ఆ ప్రాజెక్టు లైన్లోనే ఉందని టాక్ వచ్చింది. అది లీడర్ రేంజ్ సినిమా అవుతుందేమోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో మొన్ననే ముకుంద సినిమాలో బస్సులో బాబాయ్ గా కనిపించాడు కమ్మలు. ఆ దెబ్బకి మనోడు మెగా హీరో వరుణ్ తేజ్ ను దర్శకత్వం వహిస్తున్నాడేమోనని అందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే ఇప్పుడు అదే నిజమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మధ్యన కమ్ముల చెప్పిన ఒక కథ విన్న దిల్ రాజు.. సదరు కథను స్ర్టయిట్ గా వరుణ్ దగ్గరకు తీసుకెళ్ళాడు. మనోడికి కూడా అది నచ్చేయడంతో ఇప్పుడు ఈ హ్యాపీ డేస్ దర్శకుడు తన కెరియర్ లో కి హ్యాపీనెస్ తిరిగొచ్చే రేంజులో స్ర్కిప్టును చెక్కుతున్నాడట.

అన్నీ కుదిరితే.. శ్రీను వైట్లతో మిష్టర్ పూర్తిచేయగానే.. ఈ సినిమాను పట్టాలెక్కిస్తాడట వరుణ్ తేజ్. ఆ విధంగా కమ్ముల ఖాతాలో ఒక మెగా సినిమా పడే ఛాన్సుంది మరి.

,  ,  ,  ,  ,  ,