Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-May-2015 11:03:02
facebook Twitter Googleplus
Photo

నృత్య దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న లారెన్స్, దర్శకుడిగా మాఫియా కథాంశాలను .. దెయ్యాల కథాంశాలను తెరకెక్కించాడు. అయితే దెయ్యాల కథాంశం ఆయనకి బాగా కలిసొచ్చింది. 'ముని' పేరుతో ఎంచుకున్న దెయ్యాల నేపథ్యాన్ని కాంచన .. కాంచన 2 ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి వరుస విజయాలను అందుకున్నాడు. ఈ సినిమాలన్నింటిలో మిగతా పాత్రధారులు మారినా లారెన్స్ తో పాటు కంటిన్యూగా ఒక నటీమణి మాత్రం కనిపిస్తూ వస్తోంది .. ఆమెనే కోవై సరళ.

ఈ కథాంశానికి సంబంధించి ప్రతి భాగంలోను లారెన్స్ తల్లి పాత్రను ఆమే పోషిస్తోంది. ఈ పాత్రలో తాను భయపడుతూ ప్రేక్షకులను నవ్వించడంలో ఆమె మంచి మార్కులు కొట్టేసింది. ఆ పాత్రలో అంతగా మెప్పిస్తున్నందు వల్లనో, తన తల్లి పాత్రలో ఆమె ఉంటేనే బాగుంటుందనే సెంటిమెంటో తెలియదుగానీ, కాంచన సీక్వెల్ గా ఇక ముందు ఎన్ని భాగాలు వచ్చినా వాటిలో కోవై సరళ తప్పనిసరిగా ఉంటుందని లారెన్స్ చెబుతున్నాడు. కాబట్టి కోవై సరళ కామెడీని ఇష్టపడేవాళ్లు ఇక ముందు ఈ సినిమాలో ఆమె ఉందా .. లేదా? అనే ఆలోచన చేయకుండా సరాసరి థియేటర్ కి వెళ్లిపోవచ్చన్న మాట.

,  ,  ,  ,