Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2015 10:53:05
facebook Twitter Googleplus
Photo

'లింగా' సినిమా తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే తదుపరి సినిమా ఏమిటన్నది ఇంతవరకు ఖరారు కాలేదు. దాంతో 'ఈ చిత్రానికి ఫలానా దర్శకుడు' అంటూ రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. ఈ క్రమంలో తాజాగా కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ లారెన్స్ పేరు కూడా ఇప్పుడు వినిపిస్తోంది. రజనీకి లారెన్స్ చిన్నప్పటి నుంచీ వీరాభిమాని. దాంతో ఎప్పటికైనా ఆయనను డైరెక్ట్ చేయాలన్న లక్ష్యంతో సాగుతున్నాడు. తాజాగా ఆయన కోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్టు కూడా తయారుచేశాడట. ఈ నేపథ్యంలో ఇటీవల రజనీని పలుమార్లు కలసి దీనిపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, రజనీ ఇంతవరకు ఇతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాగని తిరస్కరించనూ లేదు. ఏమైనా జరగచ్చన్నమాట!

,  ,  ,  ,  ,