Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2017 14:03:08
facebook Twitter Googleplus
Photo

ఆరడగుల బుల్లెట్ రిలీజ్ సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ అవుతుందని అనుకుంటే.. ఆఖరి నిమిషంలో వాయిదా పడిపోయింది. ఇందుకు కారణం సినిమా ఫైనాన్షియర్లకు నిర్మాతకు చివర్లో డీల్ కుదరకపోవడమే.

ఈ చిత్రానికి మొదటగా ఫైనాన్స్ చేసిన చెన్నై బేస్డ్ ఫైనాన్షియర్లు.. తమకు రావాల్సిన 6 కోట్లు ఇస్తే మాత్రమే సినిమా విడుదలకు అనుమతిస్తామని తేల్చేశారట. నిజానికి ఈ మూవీ షూటింగ్ సుదీర్ఘ కాలం జరగడంతో.. అనుకున్నదానికంటే ఖర్చు తడిసిమోపెడైంది. గోపీచంద్ మార్కెట్ కంటే ఎక్కువగా ఖర్చు చేశారనే టాక్ ఉంది కూడా. అయితే.. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల కోసం.. గోపీచంద్ తో పాటు.. హీరోయిన్ నయనతార కూడా తన రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుని సహకరించారట. అయితే.. ఇప్పటికిప్పుడు 6 కోట్లు తెచ్చి ఫైనాన్షియర్లకు చెల్లించేందుకు నిర్మాత సిద్ధంగా లేడని తెలుస్తోంది.

ముందు విడుదలకు సహకరిస్తే.. అప్పుడు చెల్లింపులు సిద్ధమే అని చెప్పినా వారు అంగీకరించకపోవడమే.. తాజా సంక్షోభానికి కారణంగా తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,