Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Aug-2017 12:14:30
facebook Twitter Googleplus
Photo

నితిన్ లై అంటూ వస్తున్న ఈ యంగ్ హీరో మొదట్లో పోస్టర్లతో ఇంప్రెస్ చేసి ఆ తరువాత టీజర్ తో దుమ్ములేపేశాడు. కుంజర హతహా అంటూ మహాభారతం బ్యాక్ డ్రాపులో అబద్దం ఆడకుండా ఏ యుద్దం కూడా సంపూర్ణం కాలేదంటూ చెప్పకనే చెప్పారు. ఈ టీజర్ తరువాత పాటలతో కూడా నితిన్ అదే రకంగా ఇంప్రెస్ చేస్తున్నాడు.

ఈ మధ్యన ఫిలిం ఇండస్ర్టీలో ఒక నయా ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే.. అన్ని పాటల్లో హీరో హీరోయిన్లు ఉంటారు కాని.. ఒక పాటలో మాత్రం హీరోయిన్ కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తారు. మొన్న వచ్చిన ఫిదా సినిమాలో వచ్చిండే బిస్కెట్ ఏసిండే అంటూ సాయిపల్లవి అలాగే జనాలను పడేసింది. ఇప్పుడు నితిన్ లై సినిమాలో కూడా హీరోయిన్ మేఘా ఆకాష్ అలాగే పడేస్తోంది. లగ్గం టైమ్ అంటూ వచ్చిన ఒక సాంగ్ ఇప్పుడు మ్యూజిక్ లవ్వర్స్ ను బాగానే అలరిస్తోందని చెప్పాలి. ఈ సాంగులో ముఖ్యంగా రామాయణ ఘట్టం మొత్తాన్ని బాగా వాడేశారు. ఆ లిరిక్స్ లో జానకి కాదు తాటకి అంటూ అబ్బాయిలు ఆటపట్టిస్తుంటే.. ఇది నా లగ్గం టైమ్ అంటూ హీరోయిన్ అలరిస్తోంది.

ఇకపోతే ఆగస్టు 11న లై సినిమాను రిలీజ్ చేయడానికి చాలా తీవ్రంగానే కృషి చేస్తున్నారట.

,  ,  ,  ,  ,