Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 15:15:21
facebook Twitter Googleplus
Photo

సినిమా అంటే కోట్ల రూపాయలతో ముడిపడ్డ వ్యవహారం. అందులోనూ స్టార్ హీరోలతో సినిమా అంటే వ్యవహారం మామూలుగా ఉండదు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో మూవీ అంటే చెప్పాల్సిన పనే లేదు. చాలా లెక్కలుంటాయి. చాలా భారీతనం ఉంటుంది. కాబట్టి సినిమాలు ఎంచుకునేటపుడు ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఐతే మహేష్ మాత్రం తాను సినిమాను ఎంచుకునే విషయంలో మరీ ఎక్కువ ఆలోచించనంటున్నాడు. కథ విన్నాక నిర్ణయం చెప్పడానికి నాన్చడం తనకు అలవాటు లేదంటున్నాడు. కథ విన్న సమయంలోనే నిర్ణయం వెల్లడిస్తాను తప్ప.. వారాలు నెలలు ఆగే అలవాటు తనకు లేదంటున్నాడు.

??ఓ కథ మనకు నప్పుతుందో లేదో అనుభవం ద్వారా తెలిసిపోతుంది. నేను కనెక్ట్ అయిన కథలనే చేస్తా. అలాగని ఎలాంటి సినిమాలు చేయాలో నాకు పూర్తిగా తెలిసిపోయిందని.. ఆ విషయంలో నేను మాస్టర్ అయిపోయానని అనను. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇప్పటి వరకూ నేను నమ్మిన కథల్నే ఎంచుకున్నా.

ఓ కథ వింటున్నపుడు చేయాలా వద్దా అన్నది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటా. అంతే తప్ప ?ఓ వారం ఆగి చెప్తా? అనే అలవాటు నాకు లేదు?? అన్నాడు మహేష్. తన కొత్త సినిమా ?బ్రహ్మోత్సవం? కథను ?శ్రీమంతుడు? చేస్తుండగా విన్నానని.. వెంటనే కనెక్టయిపోయి ఓకే చెప్పేశానని.. ?శ్రీమంతుడు? లాంటి మంచి సినిమా తర్వాత తనకు ఇలాంటి బలమైన.. గొప్ప కథ దొరకడం తన అదృష్టమని మహేష్ చెప్పాడు.

,  ,  ,  ,  ,