Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Aug-2016 12:12:54
facebook Twitter Googleplus
Photo

సాహ‌సం స్వాస‌గా సాగిపో, ప్రేమ‌మ్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు నాగచైత‌న్య‌. సోగ్గాడే చిన్నినాయ‌న ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ కూడా? చైతూ కోసం ఓ క‌థ రెడీ చేశాడ‌ని టాక్‌. ప్రేమ‌మ్ త‌ర‌వాత ఈ సినిమానే ప‌ట్టాలెక్కే అవ‌కాశాలున్నాయి. ఈలోగా చైతూ కోసం మ‌రో ద‌ర్శ‌కుడు క్యూలోకి వచ్చాడు.

త‌నే.. సెల్వ రాఘ‌వ‌న్‌. ట్రెండ్ సెట్ సినిమాలు తీసిన దర్షకుడీయన. త‌మిళ‌నాట క్రేజీ ద‌ర్శ‌కుడిగా పేరుపొందిన సెల్వ‌.. ఇప్పుడు చైతూ కోసం ఓ కధ రెడీ చేశాడట. ఇటీవ‌ల చైతూని క‌ల‌సి ఓ లైన్ వినిపించాడ‌ట‌. అది నాగ‌చైత‌న్య‌కు బాగా న‌చ్చేసింద‌ని టాక్‌. అయితే ఇది కళ్యాణ్ క‌ల్యాణ్ కృష్ణ సినిమా తర్వాతే మొదలయ్యే ఛాన్స్ వుంది. తెలుగు, తమిళ్ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది

,  ,  ,  ,  ,  ,