Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2016 11:29:45
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల శిష్యుడు దర్శకత్వం వహించిన సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు వినోద్ లింగాల అనే యువదర్శకుడు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన ఇప్పుడు ఓ యువ జంటతో కలిసి ?గుప్పెడంత ప్రేమ? అనే సినిమాను తెరకెక్కించాడు. ప్రతి వ్యక్తి జీవితంలోనే ఫస్ట్ లవ్ వుంటుంది. అది ఓ మధురానుభూతి. దానినే ఓ దృశ్యకావ్యంగా తెరకెక్కించాం అంటున్నాడు దర్శకుడు. తాను ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాకు మధుర శ్రీధర్ వద్ద పనిచేసినప్పుడే ఈ సినిమాకు అంకురార్పణ ఏర్పడిందన్నారు. తన చుట్టూ వున్న స్నేహితుల ఫస్ట్ లవ్ ను బేస్ చేసుకొనే దీనిని తెరకెక్కించా అంటున్నాడు వినోద్.

The magic of తొలిప్రేమ... అంటూ పోస్టర్ పై ముద్రించి యూత్ ని అట్రాక్ట్ చేసేయడానికి ఓ కొత్త ఎత్తుగడను ఎంచుకున్నాడు దర్శకుడు. అంతేనా.. ఈ దశాబ్దపు స్వచ్ఛమైన ప్రేమకథ అని కూడా ఈ పోస్టర్ దిగువన ముద్రించాడు. మధ్యలో ప్రేమకథా చిత్రాల టైటిల్స్ అన్నీ సంవత్సరాల వారిగా ముద్రించి... వీటన్నింటికంటే.. ఇందులో చూపిస్తున్న ప్రేమ చాలా సున్నితమైనది అంటున్నాడు. మన చుట్టూ.. మన స్నేహితులు ఏవిధంగా అయితే ఫస్ట్ లవ్ ను ఎంజాయ్ చేస్తుంటారో దానినే ?గుప్పెడంత ప్రేమ?లో చూపించాడట. ఈ చిత్రాన్ని తన గురువులైన మధుర శ్రీధర్.. శ్రీకాంత్ అడ్డాల.. శేఖర్ కమ్ముల.. సందీప్ కిషన్ తదితరులకు చూపించాడట. వారు వినోద్ ను పొగడ్తలతో ముంచెత్తారని కూడా చెబుతున్నాడు. ఇలాంటి లవ్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడానికి ఓ ఫ్రెష్ జంటను ఎన్నుకోవడం వల్ల సినిమాకు చాలా ప్లస్ అవుతుందని చెప్పారట. అన్నట్టు ఇందులో నటించిన హీరో.. హీరోయిన్లు ఎవరంటే.. ఆ మధ్య పాకశాలలో నటించిన ముగ్గురు హీరోల్లో ఒకరైన సాయి రొనాక్ హీరోగా నటించగా.. అతని సరసన బాలీవుడ్ భామ అదితి నటిస్తోంది. ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

,  ,  ,  ,  ,  ,