Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2017 11:17:22
facebook Twitter Googleplus
Photo

నడిగర్ సంఘానికి సొంత బిల్డింగ్ కోసం హీరో విశాల్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశాక.. అప్పుడే పెళ్లి చేసుకుంటానని.. ఆ భవనంలో తనదే తొలి పెళ్లి అని ముందే చెప్పాడు విశాల్. ఆ సంగతేమో కానీ.. సొంత బిల్డింగ్ ఉండాలనే ఆలోచన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఇన్నాళ్లకు కలిగింది.

తెలుగు సినీ రంగానికి చెందిన అనేక విభాగాల కళాకారులు 'మా' లో సభ్యులుగా ఉన్నారు. పలు స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. స్వంత భవన నిర్మాణం చేపట్టనున్నామని మా జనరల్ సెక్రటరీ అయిన సీనియర్ నటుడు నరేష్ ప్రకటించారు. సొంత కార్యాలయం అంటే నిధులు కావాలి కదా.. అందుకే భారీ స్థాయిలో ఓ ఈవెంట్ నిర్వహించనుండగా.. దీనికి ఈ నెల 10వ తేదీన కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగబోతోంది. పలువురితో ప్రదర్శనలు.. సీనియర్ నటులకు సన్మానాలతో ఈ కార్యక్రమం భారీగానే తలపెట్టారు.

అయితే.. అలనాటి స్టార్స్ అయిన కృష్ణ.. కృష్ణంరాజులు ఈ కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నారు. సీనియర్ స్టార్స్ చిరంజీవి.. బాలకృష్ణ నాగార్జున.. వెంకటేష్ లు కూడా తమ వంతు సాయం చేస్తామన్నట్లు నరేష్ చెప్పాడు. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు సపోర్ట్ కూడా తమ మద్దతు ఇస్తామని చెప్పారట. రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్ లో భాగం అవుతానని చెప్పాడని నరేష్ అంటున్నాడు. ప్రభాస్ కూడా ఇదే మాట చెప్పాడట.

,  ,  ,  ,  ,