Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2017 10:14:30
facebook Twitter Googleplus
Photo

తనదైన శైలిలో సినిమాలను తీస్తూ కుర్ర హీరోలకు పోటీగా వెళుతున్న హీరో నాగార్జున. ఆరు పదుల వయసు దగ్గరపడుతున్నా ఇంకా నాగ్ నవ మన్మదుడిలా అందరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది 2 అనే సినిమాను తీస్తున్నాడు. పివిపి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత - సీరత్ కపూర్ కథానాయికలు కాగా వెన్నల కిషోర్ మరో పాత్రలో అలరించనున్నాడు.

అయితే ఇప్పటికే ఈ సినిమా పూర్తయ్యిందట కాకపోతే సినిమాలో కొన్ని సీన్స్ నాగార్జున కి నచ్చకపోవడంతో రీ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా ను దీపావళి కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి ఎంతకైనా మంచిదని నాగార్జున నిర్మాతతో మాట్లాడి రి షూట్ చేస్తున్నారట. అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం అక్కినేని నాగేశ్వర రావు పుట్టిన రోజు సందర్బంగా సెప్టెంబర్ ట్రైలర్ ని రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. ఆ డేటుకు ట్రైలర్ వచ్చినా కూడా.. ధియేటర్లలో మాత్రం తరువాత రోజు నుండే కనిపిస్తుంది.

అవును.. తాజా సమాచారం ప్రకారం ట్రైలర్ ని "జై లవకుశ" ఆడనున్నథియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారట. ప్రతి షోకి ముందు రాజుగారి గది 2 ట్రైలర్ కూడా ప్రేక్షకులకు చూపించేవిధంగా నాగ్ - జై లవకుశ నిర్మాతతో మాట్లాడుకున్నాడట. జై లవకుశ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,