Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2016 10:41:07
facebook Twitter Googleplus
Photo

రవిబాబు తీసిన నచ్చావులే సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది మాధవీలత. తొలి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించిందామె. దాంతో అవకాశాలు వరుసకట్టాయి. నానితో కలిసి స్నేహితుడా సినిమాలో నటించింది. అది హిట్టయ్యుంటే మాధవీలత కెరీర్ మరోలా ఉండేది. కానీ ఆ సినిమా బాక్సాఫీసును ప్రభావితం చేయలేకపోయింది. ఆ తర్వాత కూడా మాధవీలతకి అడపాదడపా అవకాశాలు వచ్చాయికానీ... ఏదీ ఆమెకి విజయాన్ని ఇవ్వలేదు. దాంతో క్రమంగా తెర మరుగైంది.

అయితే ఇప్పుడామె బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మాధవీలతకి బుల్లితెర కొత్తేమీ కాదు. ఆమె మొదట యాంకరే. ఈటీవీలో పలు కార్యక్రమాల్లో సందడి చేసేది. అక్కడ చూసే ఆమెని కథానాయికగా ఎంచుకొన్నాడు రవిబాబు. హీరోయిన్ గా చేసిన తొలి సినిమానే సక్సెస్ కావడంతో ఆమె దుమ్ము దులుపుతుందని ఊహించారంతా. కానీ వ్యవహారం కాస్త రివర్స్ అయ్యింది. ఈమధ్య కాలంలో ఆమెకి చెప్పుకోదగ్గ అవకాశాలేమీ లేవు. అందుకే మాధవీలత మళ్లీ బ్యాక్ టు బుల్లితెర అంటూ టీవీల్లో మెరిసేందుకు రంగం సిద్ధం చేసుకొంది. ఈమధ్య కాలంలో బుల్లితెర కూడా జీవితాల్ని మారుస్తోంది. రష్మి అనసూయలాంటి భామలు బుల్లితెరతోనే పాపులారిటీ సంపాదించారు. ఆ గుర్తింపుతోనే ఇప్పుడు మళ్లీ వెండితెరపై సందడి చేస్తున్నారు. లక్షలకి లక్షలు పారితోషికాలు సొంతం చేసుకొంటున్నారు. ఆ భావనతోనే మాధవీలత మళ్లీ బుల్లితెరపైకి వస్తున్నట్టు తెలుస్తోంది. మరి మాధవీలత రష్మి - అనసూయల్లాగే ఘాటుగా కనిపించి సందడి చేస్తుందేమో చూడాలి

,  ,  ,  ,  ,  ,