Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Sep-2015 17:01:56
facebook Twitter Googleplus
Photo

విశ్వనటుడు కమల్ హాసన్ సినిమా అంటే కచ్ఛితంగా లిప్ లాక్ ఉండాల్సిందే. అతడి కెరీర్ ఆరంభం నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతున్నదే. అయితే ఇటీవలి కాలంలో మెచ్యూర్డ్ క్యారెక్టర్ లను ఎంపిక చేసుకుని లిప్ లాక్ లకు దూరంగా ఉంటున్నాడు ఈ విలక్షణ నటుడు. అయితే ఉన్నట్టుండి చీకటిరాజ్యం చిత్రంలో ఇద్దరు హీరోయిన్ లతో లిప్ లాక్ వేసి సంచలనం సృష్టించాడు. అందాల కథానాయిక త్రిష - తెలుగమ్మాయి మధుశాలిని ఇద్దరితో పెదవి ముద్దులు లాగించేశాడు కమల్.

అయితే చీకటిరాజ్యం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసినప్పుడు కమల్ హాసన్ లిప్ లాక్ ఓ సస్పెన్స్. అందులో హీరోయిన్ ఎవరన్నది తెలియకుండా దాచారు. చాలా కాలం సస్పెన్స్ రివీల్ కాలేదు. కానీ ఆ పోస్టర్ లో ఉన్నది మధుశాలిని అంటూ క్రిటిక్స్ కనిపెట్టేశాడు. దాంతో అది రివీలైపోయింది. ఇదే సంగతిని మధూ ప్రస్థావిస్తూ .. ఆ పోస్టర్ సస్పెన్స్ ని ఇంకొంత కాలం కొనసాగించాలని అనుకున్నా కుదరలేదు. మొత్తానికి నేనే అది అని అందరికీ తెలిసిపోయింది.. ఆ కిస్ గురించి కూడా తెలిసిపోయింది.. కాకపోతే దాని వెనుక ఉన్న నిజం త్వరలో తెలుస్తుంది.. అంటూ ఎగ్జయిట్ అయ్యింది.

అంతేనా కమల్ హాసన్ తో ఆ అనుభవాన్ని అంత తేలిగ్గా మర్చిపో్లేకపోయానని చెప్పింది. కమల్ నుంచి నటీనటులంతా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. క్రియేటివిటీలో ఎమోషన్ పలికించడంలో అతడు గురువు లాంటివాడు. కమల్ హాసన్ - శ్రీదేవి జోడీ ది బెస్ట్ క్రియేటర్స్ నా దృష్టిలో.. అంటూ చాలా ఎమోషన్ అయ్యింది మధూ. అదీ సంగతి.

,  ,  ,