Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 11:16:16
facebook Twitter Googleplus
Photo

అటు మలయాళంలోను.. ఇటు తెలుగులోను ఈ బ్యూటీ ఫుల్లు పాపులర్. ప్రేమమ్ మూవీలో చివరకు హీరో ప్రేమను గెలుచుకుని నిలుపుకునే పాత్రలో నటించిన ఈ సుందరికి.. రెండు భాషల్లోనూ అదే రోల్ తో గుర్తింపు దక్కింది. ఇప్పుడీ మడొన్నా.. హఠాత్తుగా అందరికీ షాక్ ఇచ్చేసింది.

గత కొన్ని రోజులుగా హ్యాకింగ్ అనే మాటకే.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బెదిరిపోతున్న పరిస్థితి. గాయని సుచిత్ర అకౌంట్ లో జరుగుతున్న వ్యవహారం ఫలితమే ఇదంతా. సుచిలీక్స్ అంటూ దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన ఈ ఎపిసోడ్ లో.. తారల ప్రైవేటు ఫోటోలు.. న్యూడ్ వీడియోలు దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. సుచిత్ర అకౌంట్ హ్యాకింగ్ కు గురయిందని ఆమె భర్త కార్తీక్ చెబుతున్నాడు. ఇప్పుడు సడెన్ గా తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ.. మడొన్నా సెబాస్టియన్ చెప్పడంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా కలవరానికి గురయింది.

తన పేజ్ లో పోస్ట్ అయే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని మడొన్నా చెబుతోంది.

,  ,  ,  ,  ,  ,