Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 10:50:41
facebook Twitter Googleplus
Photo

ఇంతకుముందు ఒక సినిమా పూర్తి చేశాకే ఇంకో సినిమా గురించి ఆలోచించేవాడు మహేష్ బాబు. కానీ ఇప్పుడు రూటు మార్చాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండు మూడు సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్వల్ ఫిలిం చేస్తున్న మహేష్ బాబు.. జనవరి నుంచి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. కొరటాల సినిమాతో సమాంతరంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు కొత్త కబురు వినిపిస్తోంది.

ప్రస్తుతం చేస్తున్నది మహేష్ బాబుకు హీరోగా 23వ సినిమా. కొరటాలది 24వ సినిమా అవుతుంది. 25వ సినిమా మైల్ స్టోన్ కాబట్టి దాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. మహేష్ కోసం ఆల్రెడీ త్రివిక్రమ్ ఓ కథ రాశాడు. ఐతే ఇద్దరూ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో అది పక్కనబెట్టాడు. ఐతే ?కాటమరాయుడు? అయ్యాక పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని చూస్తున్న త్రివిక్రమ్.. ఆ సినిమా ఆలస్యమవుతున్న నేపథ్యంలో వీలైతే మహేష్ బాబు సినిమా చేసే అవకాశాలున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నారు. 25వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడైతే బాగుంటుందని మహేష్ అనుకుంటున్నాడట. ఈ మధ్య కొన్ని పెద్ద పెద్ద కాంబినేషన్లు తెరమీదికి రావడం.. ఆ తర్వాత రద్దవడం.. లేదా ఆలస్యం కావడం మామూలైపోతోంది. ఈ నేపథ్యంలోనే వంశీ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ తో మహేష్ సినిమా చేస్తే ఆశ్చర్యమేమీ లేదంటున్నారు.

,  ,  ,  ,  ,  ,