Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2016 17:42:19
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడో కీలకమైన మైలురాయికి చేరువ అవుతున్నాడు. మహేష్ హీరోగా ఇప్పటికి 21 సినిమాలు రిలీజ్ అవగా. 22 వ చిత్రంగా బ్రహ్మోత్సవం త్వరలో విడుదల అవుతోంది. అంటే ప్రిన్స్ ఎట్ 25కి రెండు మూవీస్ మాత్రమే గ్యాప్ ఉందన్న మాట. తన ఇరవై ఐదో చిత్రంగా మహేష్ ఏ సబ్జెక్ట్ ని ఎంచుకుంటాడు? ఎవరికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాడనే ఆసక్తి సూపర్ స్టార్ అభిమానుల్లో నెలకొంది.

తన 23వ సినిమాగా మహేష్ ఇప్పటికే ఓ ప్రాజెక్టును ఫైనలైజ్ చేసేశాడు. మురుగదాస్ తో తన నెక్ట్స్ మూవీ చేయనున్నాడు మహేష్ బాబు. బ్రహ్మోత్సవం రిలీజ్ తర్వాత దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే... దీని తర్వాత ప్రాజెక్టు కూడా ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. మహేష్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జన గణ మన.. సూపర్ స్టార్ 24వ సినిమాగా వచ్చే ఛాన్స్ ఉంది. అసలు లెక్క దీని మొదలవుతుంది. ఇప్పుడు మహేష్ సినిమాలు చేస్తున్న స్పీడ్ ప్రకారం... మురుగదాస్ మూవీ కంప్లీట్ చేయడానికి కనీసం 6 నెలల పడుతుంది.

ఆ తర్వాత రిలీజ్ వగైరాలను చూసుకున్నా.. వచ్చే ఏడాది ప్రారంభంలోనే 24వ సినిమా ఉంటుంది. అది కంప్లీట్ అయ్యేసరికి 2017చివరకు వచ్చేయడం ఖాయం. అంటే మహేష్ 25వ సినిమా ఏదో తెలియాలంటే కనీసం ఏడాదిన్నర ఆగక తప్పదన్న మాట. అయితే.. ఇప్పటినుంచే ఈ ప్రాజెక్టు కోసం పలువురు అగ్ర నిర్మాతలు మహేష్ ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,