Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Feb-2017 10:37:02
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దువ్వాడ జగన్నాథం ఫస్ట్ లుక్ బయటికి వచ్చేసింది. అభిమానుల అంచనాల్ని ఫస్ట్ లుక్ బాగానే అందుకుంది. బ్రాహ్మణ కుర్రాడిగా అల్లు అర్జున్ అవతారం జనాల్ని బాగానే ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూశాక సినిమా ఎలా ఉంటుందో అందరికీ ఒక అంచనా వచ్చేసింది. ఈ పోస్టర్లో చాలా విశేషాలే కనిపించాయి. పాత బజాజ్ స్కూటర్ మీద హీరో వెళ్తుండటాన్ని బట్టి ఇది కొన్నేళ్ల వెనకటి నేపథ్యంలో సాగే కథ అని అర్థమైంది. కూరగాయలు భారీ స్థాయిలో బండి మీద పెట్టుకుని తీసుకెళ్తున్నాడు కాబట్టి.. హీరో పాత్ర ఏమై ఉంటుందో కూడా ఒక అంచనాకు వచ్చేశారు జనాలు.

మరింత క్లారిటీ కోసం స్కూటర్ మీద ఒక వైపు అన్నపూర్ణ కేటరింగ్సు.. ప్యూర్ వెజిటేరియన్సు అని రాసి ఉన్న ఒక లోగోను గమనించవచ్చు. అంటే హీరో ఫ్యామిలీ కేటరింగ్ బిజినెస్ చేస్తుందన్నమాట. కాబట్టి అదుర్స్ తరహాలో పౌరోహిత్యం లాంటిదేమీ ఉండకపోవచ్చు. హీరో బ్రాహ్మణుడు.. అతడి ఫ్యామిలీ కేటరింగ్ చేస్తుంది అనగానే కమల్ హాసన్ సినిమా మైకేల్ మదన కామరాజు గుర్తుకు రాకమానదు. అందులోనూ హీరో అండ్ ఫ్యామిలీ బిజినెస్ అదే. అదుర్స్ సినిమాలో చారి పాత్రకు సంబంధించి హరీష్ శంకర్ హ్యాండ్ ఉంది. ఆ సినిమాలో ఆ ట్రాక్ ఎంతగా వినోదం పండించిందో తెలిసిందే. దువ్వాడ జగన్నాథం కూడా అదే తరహాలో ఎంటర్టైన్ చేస్తుందేమో చూద్దాం.

,  ,  ,  ,  ,  ,