Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2017 15:49:35
facebook Twitter Googleplus
Photo

వర్మకు ప్రాణ భయం ఏమీ లేనట్లే అనిపిస్తుంది. ఆయన సోషల్ మీడియాలో కొందరు వ్యక్తుల గురించి.. కొన్ని అంశాల గురించి స్పందించే తీరు చూస్తే.. ఈయనకసలు ఎవరైనా ఏమైనా చేస్తారేమో అన్న కంగారే లేదా అన్న సందేహం కలుగుతుంది. ఐతే తాను భయపడని సందర్భాలే లేవని ఏమీ కాదంటున్నాడు వర్మ. తన మీద మర్డర్ అటాక్ జరగబోతోందనే భయంతో ఓసారి తాను ఏం చేసిందీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించాడు వర్మ. ఆ ఆసక్తికర విశేషాలు వర్మ మాటల్లోనే..

‘‘నేను ముంబయిలో పెద్ద అపార్మ్ మెంట్ లో ఎనిమిదో ఫ్లోర్లో ఉంటాను. బయటికి వెళ్లాలనుకున్నపుడు నా ఫ్లాట్లో ఉండే బాయ్.. కింద డ్రైవర్ కు ఫోన్ చేస్తాడు. నేను లిఫ్టులో కిందికి దిగే లోపు డ్రైవర్ కారుతో రెడీగా ఉంటాడు. ఒకసారి అలాగే నేను ఫ్లాట్ నుంచి బయల్దేరానని సమాచారం తెలుసుకుని కారు తీసుకుని రెడీగా ఉన్నాడు డ్రైవర్. ఐతే నేను లిఫ్ట్ దిగగానే ఒక వ్యాన్ కనిపించింది. అందులోని వ్యక్తులు నన్నే చూడటం గమనించాను. నన్ను చూశాక ఆ వ్యాన్ కొంచెం ముందుకు కదిలింది. అంతలోనే వ్యాన్ మాయమైంది. మళ్లీ కొంచెం ముందుకు కదలిసేసరికి వాళ్లు వాచ్ మన్ తో మాట్లాడుతూ కనిపించారు. ఆ గ్యాంగులో వాళ్లు నన్ను అనుమానంగా చూడటం మొదలుపెట్టారు దీంతో వాళ్లు నన్ను చంపడానికే వచ్చారని అనుకున్నాను.

క్షణ కాలంలో ఏం చేయాలో ఆలోచించి లోపలికి పరుగెత్తాను. లిఫ్టు రెడీగా ఉంటుందో లేదో.. దాని కోసం చూస్తే నన్ను చంపేస్తారేమో అనుకుని మెట్లెక్కడం మొదలుపెట్టాను. నాలుగో ఫ్లోరుకు వెళ్లిపోయాను. మూడో ఫ్లోర్లో నా ఫ్రెండొకడు ఉంటాడు. వెనక్కి వెళ్దామా అనిపించింది. కానీ మధ్యలో వాళ్లు ఎదురు పడి అటాక్ చేస్తారేమో అనుకున్నా. అలాగే ఆరో ఫ్లోరుకు పరుగెత్తాను. లిఫ్ట్ కనిపించింది. నా ఫ్లాట్లో ఆగకుండా పదో ఫ్లోరుకు వెళ్లిపోయా. వాళ్లు నన్ను వెతకడానికి టైం పడుతుంది కాబట్టి నేను సేఫ్ అనుకున్నా. పదో ఫ్లోర్లో ఓ ఫ్లాట్ డోర్ కొట్టా. ఆ వ్యక్తి నన్ను గుర్తుపట్టాడు. తోసుకుని లోపలికెళ్లి డోర్ వేశాను. వాళ్లు కంగారు పడ్డారు. నా ఫోన్ కార్లో ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఆయన డ్రైవర్ కిందున్నాడంటే తనకు ఫోన్ చేసి.. నా డ్రైవర్ తో మాట్లాడాను. ఏమైందని అడిగాడు. ఆ వ్యాన్ వాళ్ల గురించి చెబితే.. వాళ్లు లిఫ్ట్ సర్వీస్ కోసం వచ్చారని.. నన్ను గుర్తు పట్టడం వల్లే అలా చూశారని చెప్పాడు. ఆ సమయంలో నేను భయపడ్డానా అంటే చెప్పలేను. నాకు భయపడే టైం కూడా లేదు. భయపడి ఉంటే నేను అంత చురుగ్గా వ్యవహరించేవాడిని కాదేమో’’ అన్నాడు వర్మ.

మరో సందర్భంలో ఒక వ్యక్తి బైకు మీద నా కారును ఫాలో చేస్తున్నట్లు తన డ్రైవర్ చెప్పాడని.. తర్వాత తన అపార్ట్ మెంట్ కు వెళ్తే అక్కడికీ వచ్చాడని.. తన దగ్గరికి వస్తూ బ్యాగులో చేయి వేయబోతే తన డ్రైవర్ గన్ను తీసి కాల్చేయబోతున్నాడని గట్టిగా అరిచేశాడని.. కానీ అతనో రైటర్ అని.. స్క్రిప్టు ఇవ్వడం కోసం తన దగ్గరికి వచ్చాడని తర్వాత తెలిసిందని.. ఆ సమయంలో తాను మాత్రం ఎలాంటి ఆందోళనకు గురి కాలేదని వర్మ తెలిపాడు. మరో సందర్భంలో భూకంపం వల్ల తన ఫ్లాట్ షేకవడం గమనించానని.. ఇక తన చావు ఖాయం అని రూఢి చేసుకుని.. ఫ్లాట్ కూలిపోయేటపుడు శబ్దం ఎలా ఉంటుందో విందామని ప్రశాంతంగా కూర్చున్నానని.. తాను అనుకున్నట్లుగా ఏమీ జరగలేదని వర్మ తెలిపాడు.

,  ,  ,  ,  ,  ,