Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2016 16:07:45
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న ?బ్రహ్మోత్సవం? సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తోన్న అభిమానుల్లో ఉత్సాహం నింపుతూ నిన్న సాయంత్రం టీమ్ ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మే 6న హైద్రాబాద్‌లో శిల్పకళావేదికలో ఆడియో విడుదల కానుండగా, మే 20న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. ఇక సినిమాను అనుకున్న సమయానికల్లా ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీమ్ ఇప్పటికే ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ చివరిదశకు చేర్చేసింది.
ప్రస్తుతం మహేష్, సమంతలతో పాటు సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తోన్న పలువురిపై ఓ మాంటేజ్ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో సినిమా మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత మిగిలి ఉన్న ప్యాచ్‌వర్క్‌ను కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‍ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు. మరోపక్క పీవీపీ సంస్థ ఇప్పటికే ఆడియో లాంచ్ కోసం సన్నాహాలు పూర్తి చేస్తోంది. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.

,  ,  ,  ,  ,  ,