Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2015 09:39:02
facebook Twitter Googleplus
Photo

విజయవాడ నేపథ్యంలో ఎన్నో సినిమాల చిత్రీకరణ జరిగింది. ఇక్కడి స్థల మహాత్మ్యం విజయంతో ముడిపడి వుండటం వల్లనేమో చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. మరి కొన్ని సినిమాలకు భారీస్థాయి గుర్తింపు లభించింది. కథాపరంగా కూడా కొన్ని సినిమాలు ఇక్కడ తెరకెక్కుతూ వుంటాయి. తాజాగా ఈ జాబితాలో మహేష్ బాబు సినిమా 'బ్రహ్మోత్సవం' చేరినట్టు సమాచారం అందుతోంది. బంధాలు .. భావోద్వేగాలు ... యాక్షన్ దృశ్యాలు ఈ సినిమాలో ప్రేక్షకులను కదిలించనున్నాయి.

విజయవాడ నేపథ్యంతో కూడిన కథను శ్రీకాంత్ అడ్డాల తయారు చేసుకున్నాడు. అందువలన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడ జరిగే అవకాశముంది. విజయవాడ నేపథ్యంలో చిత్రీకరణ జరుపుకున్న సినిమాలు విజయోత్సవాలు జరుపుకున్నాయి. ఆ సెంటిమెంట్ తప్పకుండా ఈ సినిమా విషయంలోను వర్కౌట్ కావాలని అభిమానులు ఆశిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పుస్కరించుకుని మే 31న ఈ సినిమా షూటింగ్ ను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,