Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jun-2015 17:40:24
facebook Twitter Googleplus
Photo

తమన్నా ఆ మధ్య బాలీవుడ్ పై ఎక్కువగా దృష్టిపెట్టడం వల్ల, తెలుగు .. తమిళ చిత్రాల సంఖ్యను తగ్గించుకుంది. అక్కడ ఫలితం అంతగా కనిపించకపోవడంతో తిరిగి తెలుగు సినిమాలకి చకచకా సంతకాలు చేసేసింది. ప్రస్తుతం అవి సెట్స్ పైన వున్నాయి. ఈ నేపథ్యంలో .. తమిళ్లో వచ్చిన గ్యాప్ ను కూడా భర్తీ చేసుకునే పనిలో పడింది.

అందులో భాగంగానే విశాల్ సరసన సినిమా చేయడానికి అంగీకరించింది .. ఆ సినిమా పేరే 'సందైకోళి 2'. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విశాల్ సరసన మీరాజాస్మిన్ కథానాయిక. అప్పుడు ఆ సినిమా 'పందెం కోడి' పేరుతో తెలుగులోనూ విడుదలై విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా అదే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆమె ఖాతాలోకి మరో తమిళ చిత్రం చేరింది.

,  ,