Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Mar-2016 14:21:28
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం షూటింగ్ హైద్రాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని మే నెలలో విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 2వ వారంలో ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఆడియో వేడుకను తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొన్ని రోజులు బ్రహ్మోత్సలం క్లైమాక్స్ సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీటిలో ప్రధాన నటులంతా పాల్గొంటున్నారని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఎమోషన్స్ తో కట్టిపడేసేలా ఈ క్లైమాక్స్ ఉంటుందని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల గత సినిమాల మాదిరిగానే బ్రహ్మోత్సవం కూడా పూర్తి స్థాయి సెంటిమెంట్ - ఎమోషన్స్ ఉంటాయని.. కుటుంబ సభ్యుల అనుబంధాలను మనసును ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

బ్రహ్మోత్సవం షూటింగ్ ప్రోగ్రెస్ పై వస్తున్న రూమర్స్ ను యూనిట్ సభ్యులు కొట్టి పడేస్తున్నారు. పక్కా ప్లానింగ్ ప్రకారం అనుకున్న విధంగానే షూటింగ్ జరుగుతోందని చెబుతున్నారు. మే నెలలో ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రహ్మోత్సవం విడుదల ఖాయమని తేల్చేస్తున్నారు నిర్మాతలు. ముగ్గురు భామలు కాజల్ - సమంత - ప్రణీతలు బ్రహ్మోత్సవంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,