నాగార్జున ?ఓం నమో వేంకటేశాయ?లో అనుష్క ఓ భక్తురాలి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. సీన్ లో ఆమె నటనను చూసి థ్రిల్ అయిపోతున్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. ?యే క్యారెక్టర్ అయినా చేయగలిగే అద్భుతమైన నటులలో అనుష్క ఒకరు. అది అరుంధతి అయినా, బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా తన పాత్రలకు తగ్గట్లు ఒదిగిపోతూ నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ఎప్పటినుంచో తనకి నా సినిమా లో తగిన క్యారెక్టర్ వస్తే పనిచేయాలని చూస్తున్నాను. ఇన్నాళ్ళకి ?ఓం నమో వేంకటేశాయ? ద్వారా జరిగింది. తన కెరీర్ లో మొదటి సారి భక్తురాలి క్యారెక్టర్ చేస్తుంది. ఆ రోల్ లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందంగా ఇంకా కొత్తగా కన్పిస్తుంది? అని అనుష్క నటనా కౌసలం గురించి చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు.
Raghaveb-ndarRao, About, AnushkaShetty, Matter, Tollywood,