Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2015 10:38:44
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబుతో మరో మల్టీ స్టారర్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఈసారి ఈయనతో కలసి నటించేది తెలుగు హీరోలు కాదు, తమిళ, మలయాళ హీరోలు కావడం ఇక్కడ విశేషం. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా అధినేత పొట్లూరి ప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్టయిన 'జిల్లా' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు నీసన్ ఈ ప్రాజక్టును డిజైన్ చేస్తున్నాడు. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహేష్ తో బాటు మోహన్ లాల్, ఆర్య ఇందులో హీరోలుగా నటిస్తారు. 200 కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా ప్రాథమిక దశలోనే వుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

,  ,  ,  ,  ,