Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2017 13:06:33
facebook Twitter Googleplus
Photo

స్పైడర్ సినిమాతో ఊహించని విధంగా అపజయాలను ఎదుర్కొన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భారత్ అనే నేను సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మహేష్ అభిమానులను ఒక అనుమానం మరొక రూమర్ చాలా కలవరపెడుతోంది. ఈ సినిమాకు ఆ రెండు కాస్త నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా కొరటాల శివ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపాడు. మనం రాసుకున్న కథని మనమే సరిగ్గా తెరకెక్కించగలం. ఇతరుల రాసిన కథ అంత బాగా ప్రజెంట్ చేయలేకపోవచ్చు అని చెప్పడంతో.. అందరూ షాకయ్యారు. ఎందుకంటే భరత్ అనే నేను కథని కొరటాల కొన్నాడని టాక్ ఉంది. అయితే మొదట కథ బాగానే ఉన్న సెట్స్ పైకి వచ్చేసరికి కొరటాలకు తేడా కొడుతోందని టాక్ వినిపిస్తోంది. ఇది ఒక రూమర్ అయితే మరొక అనుమానం మాత్రం బలంగా ఉంది.

అదేంటంటే.. మహేష్ బాబు ఇప్పటివరకు పని చేసిన దర్శకులతో రెండవసారి హిట్ కొట్టలేదు. ఒక్క పూరి జగన్నాథ్ తో మాత్రం పరవాలేదు అనిపించాడు. గుణశేఖర్ - త్రివిక్రమ్ అలాగే శ్రీకాంత్ అడ్డాల అండ్ శ్రీను వైట్ల వంటి దర్శకులతో మొదటి సారి వర్క్ చేసి మంచి హిట్ అందుకున్న మహేష్ రెండవసారి సినిమా చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ కొరటాల శివతో శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రెండవసారి చేయబోతున్నాడు.

,  ,  ,  ,  ,