Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 10:58:21
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ తో పాటు.. ఫస్ట్ లుక్ రివీల్ అయిపోయింది. చాలాకాలంగా తమ ఎదురుచూపులకు తగినట్లుగా మహేష్ ఫస్ట్ లుక్ ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్లు హ్యాపీ అయిపోతున్నారు. ఇన్నాళ్లు దర్శకుడు మురుగదాస్ ను తిట్టిపోసిన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు తెగ ఖుషీగా ఉన్నారు.

మరోవైపు స్పైడర్ మూవీ తెలుగు ప్రమోషన్స్ కంటే ముందే.. తమిళ్ లో ప్రచారం మొదలుపెట్టాడు మహేష్. అక్కడే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్బంగా ఈ సినిమా గురించి కొన్న ఆసక్తికర విషయాలు చెప్పాడు. తుపాకి.. వంటి సినిమాలు చూసి నేను థ్రిల్ కు గురయ్యాను. ఆ సినిమాల్లోని నేషనలిజం.. దేశభక్తి భావన.. దేశాన్ని కాపాడేందుకు ఏమైనా చేసే హీరో.. వంటి అంశాలు నాకు తెగ నచ్చేశాయి. అయితే ఇప్పుడు మరోసారి మురుగుదాస్ అటువంటి కథనే చెప్పినప్పుడు.. ఆయన తప్పితే ఎవ్వరూ ఈ సినిమాను హ్యాండిల్ చేయలేరు అనిపించింది. అందుకే వెంటనే ఓకె చెప్పేశాను అంటూ మహేష్ చెప్పాడు.

నిజానికి అప్పటివరకు తెలుగులో పెద్దగా క్రేజ్ లేని విజయ్.. తుపాకి సినిమాతో ఇక్కడ కూడా హిట్టు కొట్టినట్లయ్యింది. ఇంత టెరిఫిక్ సినిమానా అంటూ అందరూ అవాక్కయ్యారు. చూస్తుంటే ఇప్పుడు మహేష్ కూడా ఇటువంటి కథాంశంతో తమిళంలో కూడా తొలి బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడేమో అనిపిస్తోంది కదూ

,  ,  ,  ,  ,