Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2016 11:02:32
facebook Twitter Googleplus
Photo

సింగం సిరీస్ లో భాగంగా వస్తున్న మూడో చిత్రం ఎస్3. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మొదటి రెండు భాగాల్లోనూ నటించిన అనుష్క ఇందులోనూ హీరోయిన్ గా నటిస్తుండగా.. శృతి హాసన్ ఎస్3లో మరో కథానాయికగా నటించింది. ఇప్పుడీ చిత్రానికి టీజర్ ను రిలీజ్ చేయగా.. ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకునేలా ఉండడం విశేషం.

'ది ఇంటర్నేషనల్ కాప్' అంటూ ఎస్3 కి పెట్టిన ట్యాగ్ లైన్ కి న్యాయం చేస్తూ.. దేశవిదేశాల్లో భారీ ఖర్చుతో యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించారు. ఈ మూవీపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్లుగానే టీజర్ మొత్తాన్ని సూర్య డైలాగ్స్.. ఫైట్స్ తోనే నడిపించారు. ప్రతీ ఫ్రేమ్ లోనూ గ్రాండియర్ కనిపిస్తుండగా.. విలన్స్ ను కాలితో నలిపేయడం.. షూట్ చేసేయడం.. ఇరక్కొట్టేయడం లాంటి సీన్స్ నిమిషం వ్యవధి గల టీజర్ లోనే బోలెడన్ని ఉన్నాయి.

అనుష్క ఒక ఫ్రేమ్ లోనే కనిపించినా క్యూట్ గా ఉంది. శృతి హాసన్ ను కూడా ఒకే ఫ్రేమ్ కి పరిమితం చేశారు. సింగం సిరీస్ లోకి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్ సినిమా థీమ్ కు తగ్గట్లుగానే.. గ్రాండ్ మ్యూజిక్ ఇచ్చాడు. కాకపోతే.. మరీ ఫుల్ ప్లెడ్జెడ్ యాక్షన్ మూవీ అనే ఒక్క ఇండికేషన్ మాత్రమే ఎస్3 టీజర్ ద్వారా ఇవ్వడం ఆశ్చర్యకరం!!

,  ,  ,  ,  ,