Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2015 17:47:05
facebook Twitter Googleplus
Photo

విలువలున్న సినిమాకి పెట్టింది పేరు... శేఖర్ కమ్ముల. అయితే కొంతకాలంగా ఆయనకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర పరాజయాన్ని చవిచూస్తున్నాయి. మంచి సినిమాలే అన్నారు కానీ... అవి చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు మాత్రం చేయలేకపోయాయి. దీంతో శేఖర్ కమ్ముల కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా కిందకి పడిపోయింది. అయితే వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ ఆ క్లాసీ డైరెక్టర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన స్టైల్ లో తాను కథలు సిద్ధం చేసుకొంటున్నాడు. ఆయన చూపు తాజాగా మహేష్ బాబుపై పడిందని సమాచారం. మహేష్ కి తగ్గ కథని శేఖర్ కమ్ముల తయారు చేశాడట. నమ్రత ద్వారా ఆ కథని ఇప్పటికే మహేష్ కి వినిపించాడట కూడా. ఆ కథ గురించి డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయని ఫిల్మ్ నగర్ ఇన్ సైడ్ టాక్. మరి మహేష్ శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి ఓకే చెబుతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కథ నచ్చితే మిగతా విషయాలేవీ పట్టించుకోడు మహేష్. ప్రయోగాలు చేయడానికి కూడా ఆయన సిద్ధపడుతుంటాడు. `శ్రీమంతుడు` అలా చేసిందే. మహేష్ లాంటి స్టార్ `శ్రీమంతుడు`లాంటి ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాని చేయడం ఓ విశేషమే అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతుంటాయి. కానీ మహేష్ మాత్రం మంచి కథ అనుకొన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదని చెబుతుంటాడు. మహేష్ `శ్రీమంతుడు`లాంటి క్లాసీ సినిమాని చేసి సక్సెస్ కొట్టాడు కాబట్టి ఆయన శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి కూడా ఇంతకుమించిన మంచి తరుణం దొరకదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒట్టి మాస్ మసాలా సినిమాల్లోనే కాకుండా మహేష్ ని క్లాసీ కథల్లోనూ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారన్న విషయం అర్థమైంది కాబట్టి శేఖర్ కమ్ముల అలాంటి సినిమాలే చేస్తాడు కాబట్టి ఈ కాంబినేషన్ లో ఇప్పుడు సినిమా సెట్స్ పైకి వెళితే మంచిదే అంటున్నారంతా. మహేష్ కూడా శేఖర్ కమ్ముల తయారు చేసిన కథ విషయంలో సంతృప్తిగానే ఉన్నాడని తెలిసింది. సమస్యంతా వరుసగా సున్నితమైన కథలు చేస్తుండడమే. `బ్రహ్మోత్సవం` తర్వాత ఓ మాస్ సినిమాని చేయాలని మహేష్ అభిప్రాయపడుతున్నాడట. ఆ తర్వాతే శేఖర్ కమ్ముల సినిమా గురించి ఆలోచిస్తాడట.

,  ,  ,