Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2015 17:51:59
facebook Twitter Googleplus
Photo

శ్రీమంతుడు రిలీజ్ కు ముందు వరకు మహేష్ తర్వాతి ప్రాజెక్టులపై ఓ క్లారిటీ లేదు. బ్రహ్మోత్సవం తప్పితే ఇంకే ప్రాజెక్టునూ ఓకే చేయలేదు ప్రిన్స్. త్రివిక్రమ్ తో పూరి జగన్నాథ్ తో రాజమౌళితో సినిమాల గురించి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. వాటిలో ఏది కార్యరూపం దాల్చుతుంది.. ఏది ముందు మొదలవుతుందన్న క్లారిటీ లేకపోయింది. ఐతే ?శ్రీమంతుడు? విడుదల తర్వాత నెమ్మదిగా తెరలు తొలగిపోతున్నాయి. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ నటించబోయేది త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అని స్పష్టమైంది. ఆ సినిమాను నిర్మించబోయేది ఎవరో కూడా తేలిపోయింది.

ఆదివారం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా చాలామంది శుభాకాంక్షలు చెబుతూ ప్రకటనలు ఇచ్చారు. అందులో ఓ యాడ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ రాధాకృష్ణ (జులాయి సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల నిర్మాత) కలిసి ఉమ్మడిగా ఇచ్చిన యాడ్. పైన హారిక-హాసిని బేనర్ కూడా కనిపించింది. ఈ పోస్టర్ లో మహేష్ లుక్ కూడా ఏదో సినిమా కోసం ఫొటో షూట్ చేసి తీసినట్లు ఉంది.

చూస్తుంటే ఈ ముగ్గురి కాంబినేషన్ లో రాబోయే సినిమాకు సంబంధించిన లుక్కేనా ఇది అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. త్రివిక్రమ్ మహేష్ కు సన్నిహితుడు కాబట్టి.. అతడి వరకు యాడ్ ఇస్తే ఆశ్చర్యమేమీ లేదు. రాధాకృష్ణ కూడా తోడయ్యాడంటే ఈ కాంబినేషన్ లో సినిమా మొదలవబోతున్నట్లే. బ్రహ్మోత్సవం వచ్చే ఏడాది మార్చి 25న విడుదలవుతుంది. ఆ తర్వాత మహేష్-త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కే అవకాశముంది. ఆలోపు త్రివిక్రమ్ నితిన్ తో సినిమా పూర్తి చేస్తాడు.

TAGS: Mahesh Babu trivikr

,  ,  ,