Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2014 10:40:05
facebook Twitter Googleplus
Photo

కొంత గ్యాప్ తర్వాత తిరిగి ఎన్టీఆర్ నటిస్తున్న 'టెంపర్' చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి హైదరాబాదులో జరుగుతోంది. టాలీవుడ్ లో కార్మికుల సమ్మె, ఎన్టీఆర్ సోదరుడి మరణం నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్ళు జరగని విషయం మనకు తెలిసిందే. కాగా, నేటి నుంచి జూబ్లీ హిల్స్ లోని గులాబీ హౌస్ లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంకా పద్దెనిమిది రోజుల షూటింగ్ వర్క్ మిగిలిందనీ, నేటి నుంచి నిర్విరామంగా జరిపి పూర్తి చేస్తామనీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. ఆ వెంటనే మిగతా కార్యక్రమాలను పూర్తి చేసి, చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు.

,  ,  ,  ,  ,