Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Dec-2017 11:24:08
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు.. ఏం చేసినా కూడా అది స్టయిలిష్గా సూపర్ గా ఉంటుంది. అయితే ఈ మధ్యన ఆ స్టయిల్ అంతా సినిమాలకు అంతగా వర్కవుట్ కావట్లేదు కాని.. యాడ్స్ లో మాత్రం మహేష్ రేంజే వేరు. ఎందుకంటే మనోడు ఒక్కసారి కమిట్ అయ్యాడంటే.. ఆ బ్రాండ్ రేంజే మారిపోతుంది. అదిగో ఇప్పుడు థమ్సప్ యాడ్ చూస్తే అదే అనిపిస్తోంది.

ఆ మధ్యన మహేష్ అమెరికా వెళ్ళి మరీ ఒక థమ్సప్ యాడ్ షూట్ చేసి వచ్చాడు. ఇప్పుడు ఆ యాడ్ ఫైనల్ వర్షన్ ను స్వయంగా సూపర్ స్టారే ట్విట్టర్లో రిలీజ్ చేశాడు. ఆ యాడ్ చూస్తే.. మహేష్ స్వయంగా స్టంట్లు ఏమీ చేయకపోయినా కూడా.. ఆ రేసింగ్ కారులో.. ఇంటర్నేషనల్ రేసు ట్రాక్ పైన.. మహేష్ ఆ డ్రైవింగ్ సీట్లో.. భలే పర్ఫెక్ట్ ఫిట్ తరహాలో ఉన్నాడు. మొత్తానికి థమ్సప్ ఛార్జడ్ అంటూ వస్తున్న కొత్త డ్రింక్ కోసం ఈ కొత్త యాడ్ చాలా బాగుంది.

ఇక సినిమా విషయానికొస్తే.. ఇప్పుడు మహేష్ బాబు టాలెంటెడ్ డైరక్టర్ కొరటాల శివ డైరక్షన్లో భరత్ అను నేను సినిమాలో నటిస్తున్నాడు.

,  ,  ,  ,  ,