ఈ మధ్య తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న కొత్త సినిమా వివేగం ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి తమిళనాట పెద్ద రచ్చే జరిగింది. ఈ పోస్టర్ ఒరిజినల్ కాదంటూ యాంటీ ఫ్యాన్స్ నానా యాగీ చేశారు. వేరే ఎవరి బాడీకో అజిత్ తలను అతికించేశారని ఆరోపించారు. ఐతే అజిత్ అభిమానులు మాత్రం ఇది కేవలం దుష్ప్రచారమే అన్నారు. నిజానికి ఈ పోస్టర్ కొంచెం తేడాగానే ఉండటంతో మామూలు జనాలకు కూడా కొంచెం సందేహాలు రేకెత్తాయి. చివరికి మన హీరో రానా దగ్గుబాటికి కూడా అజిత్ లుక్ విషయంలో అనుమానాలు కలిగాయట. ఇది ఒరిజినల్ లుక్కేనా అంటూ స్వయంగా అజిత్ కు ఫోన్ చేసి మరీ అడిగేశాడట రానా.