Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2016 12:19:25
facebook Twitter Googleplus
Photo

బ్రహ్మోత్సవం సినిమా విడుదలకి ఇంకా చాలా సమయముంది. ఈ నెల 20న అంటున్నారు కానీ అధికారికంగా మాత్రం విడుదల తేదీని ప్రకటించలేదు. 7న ఆడియో మాత్రం జరగబోతోంది. మామూలుగా ఏ సినిమాకైనా ఆడియో విడుదల తర్వాతే ప్రమోషన్స్ ఊపందుకొంటాయి. అయితే మహేష్ బ్రహ్మోత్సవంకి మాత్రం ఆడియో విడుదలకంటే ముందుగానే ప్రమోషన్స్ మొదలయ్యాయి. వెబ్ సైట్ల లో ల్యాండింగ్ పేజీలు మొదలుకొని ఆడియో ఫీలర్ల వరకు ఆన్ లైన్ మొత్తం బ్రహ్మోత్సవం సందడితో హోరెత్తిపోతోంది. సినిమా స్టిల్స్ కూడా ఇబ్బడిముబ్బడిగా బయటికొస్తున్నాయి. రోజూ ఆన్ లైన్లో నాలుగుదైదు కొత్త స్టిల్స్ దర్శనమిస్తున్నాయి. సినిమా కలరింగు ఎలా వుంటుందో ఆ స్టిల్స్ నిబట్టే అర్థమవుతోంది.

శ్రీమంతుడు తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి ఆ సినిమాని మించిపోయేలా బిజినెస్ చేయాలని బ్రహ్మోత్సవం చిత్రబృందం గట్టి పట్టుదలతో పనిచేస్తోంది. అందుకోసం చేయాల్సిందల్లా చేస్తోంది. ఇది ఇంకా ఆరంభం మాత్రమే అని సినిమా విడుదల దగ్గర పడేకొద్దీ పబ్లిసిటీ ఓ రేంజిలో ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మాస్ సినిమా అయితే ఫ్యాన్స్ వద్దన్నా ఆసక్తి చూపుతారు. కానీ బ్రహ్మోత్సవంలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమాని పకడ్భంధీగా ప్రమోట్ చేయాల్సిన అవసరముంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవం బృందం కూడా ఈ సినిమాకి ఓపెనింగ్స్ బలంగా వచ్చేలా పబ్లిసిటీ చేస్తోంది. మొదట భారీ ఓపెనింగ్స్ తో మౌత్ పబ్లిసిటీ వచ్చేస్తే అది విని ఫ్యామిలీ జనాలు ఆటోమేటిగ్గా థియేటర్లవైపు కదులుతారని అంచనాలు వేస్తోంది చిత్రబృందం. మొత్తంగా ఆన్ లైన్లో బ్రహ్మోత్సవం సందడిని చూసి మహేష్ అదరగొడుతున్నాడబ్బా అంటున్నారు జనాలు.

,  ,  ,  ,  ,  ,