Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2016 14:12:08
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు తన లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవంలో.. ఓ కలర్స్ కంపెనీ ఓనర్ గా యాక్ట్ చేస్తున్నట్లు ఇప్పటికే యూనిట్ వర్గాలు చెప్పేశాయి. సాధారణంగా శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో కేరక్టర్లన్నీ తూగో -పగో - కృష్ణా జిల్లాలకు సంబంధించినవే అయి ఉంటాయి. అదే పంథాలో ఇప్పుడు కూడా మహేష్ బాబును ఓ పక్కా బెజవాడ కుర్రాడిగా చూపించారు. మరి విజయవాడ కుర్రాడంటే.. అక్కడ కూడా షూటింగ్ చేసి ఉండాలి కదా. దీనికి స్వయంగా ఓ ఆన్సర్ ఇచ్చాడు సూపర్ స్టార్.

బ్రహ్మోత్సవం మూవీలో మొత్తం 15 సెట్స్ ను హైద్రాబాద్ లోనే వేశారు. అందులోనే మహేష్ ఇంటికి సంబంధించినవి కూడా ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే హైద్రాబాద్ లో ఉండే విజయవాడ సీన్స్ తీసేశారు. 'విజయవాడలో షూటింగ్ తీయడం అసాధ్యం. అందుకే మేం ఈ సెట్స్ ను హైద్రాబాద్ లోనే వేశాం. గ్రీన్ మ్యాట్ - సీజీల సహాయంతో విజయవాడను సృష్టించాం' అని చెప్పాడు మహేష్.

మొత్తానికి బెజవాడ కుర్రాడిగా మహేష్ నటిస్తున్నా.. అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప.. అసలు ఆ ఊరికే రాలేదు మన సూపర్ స్టార్. గ్రాఫిక్స్ అద్భుతాల్లో ఇది సాధ్యమే అయినా.. కొన్ని సీన్స్ నిజంగానే అక్కడ కూడా తీసి ఉంటే.. నేటివిటీ కనెక్ట్ అవడంతో పాటు.. ఫ్యాన్స్ కూడా సంబరపడేవాళ్లు కదా మహేష్!

,  ,  ,  ,