Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2017 11:41:46
facebook Twitter Googleplus
Photo

డ్యాన్సర్ గా జీవితం ప్రారంభించి.. కొరియోగ్రాఫర్ గా ఎదిగి.. ఆ తర్వాత నటుడిగాను.. ఇప్పుడు దర్శకుడి గాను సత్తా చాటుతూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు లారెన్స్ రాఘవ. ప్రస్తుతం పి. వాసు దర్శకత్వంలో రూపొందిన శివలింగ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇంతటి ఇమేజ్ ఉన్న లారెన్స్.. మెగాస్టార్ నుంచి ఒక్క పిలుపు రాగానే వచ్చి ఖైదీ నంబర్ 150లో రత్తాలు పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశాడు. దీని వెనక ఓ సీక్రెట్ చెప్పాడు. 'ఖైదీ నంబర్ 150లో పాటకు కొరియోగ్రఫీ అందించాలంటూ అన్నయ్య(చిరంజీవి అని స్పెషల్ గా చెప్పక్కర్లేదేమో) నుంచి పిలుపు రాగానే.. వెంటనే ఫ్లైట్ పట్టుకుని హైద్రాబాద్ లో వాలిపోయా. ఈ విషయంలో మా ఇద్దరి మధ్యా ఎక్కడా రెమ్యూనరేషన్ అనే మాటే ఎక్కడా లేదు. కానీ నాకు వదిన(సురేఖ) వండి పెట్టే స్పెషల్ దోశ.. చికెన్ కర్రీ మాత్రం కావాల్సిందే' అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్ మాస్టర్.

చిరుతో లారెన్స్ కు ఇంతటి అనుబంధం ఉండడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. లారెన్స్ లో ట్యాలెంట్ గుర్తించి.. మొదటగా కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చినది చిరంజీవే. హిట్లర్ సినిమాలోని పాటలకు లారెన్స్ కంపోజ్ చేసిన స్టెప్స్.. ఇప్పటికీ సెన్సేషన్.

,  ,  ,  ,  ,