Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2017 11:30:51
facebook Twitter Googleplus
Photo

ఎక్స్ ట్రార్డినరీ థ్రిల్లర్... ఎక్స్ ట్రార్డినరీ ఫొటోగ్రఫీ.. ఎక్స్ ట్రార్డినరీ ఫైట్స్... ఎక్స్ ట్రార్డినరీ సెట్ డిజైన్స్ తో రెండు గంటల ఇరవై అయిదు నిమిషాల పాటు సినిమా చూసిన ప్రేక్షకులు స్టన్ అయిపోయేలా సినిమా తీద్దాం. సినిమా స్టోరీ సిట్టింగ్ టైంలో మురుగ దాస్ చెప్పిన మాటిది. ఆడియన్స్ కాదు.. డబ్బింగ్ చెప్పేటప్పుడు నేనే స్టన్ అయిపోయా’’ స్పైడర్ సినిమా ఎలా ఉండబోతోందో మహేష్ బాబు మూడు మాటల్లో సూపర్ కాన్ఫిడెంట్ గా చెప్పిన మాటిది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మహేబ్ బాబు చెప్పిన మాటలు అభిమానులతో ఆపకుండా ఈలలు వేయించాయి.

నాకో విషయంలో నా అబిమానులు బాగా నచ్చుతారు. నాకు తెలిసి ఇలాంటి అభిమానులు ఏ హీరోకి ఉండరు. మీరు సినిమా బాగుంటేనే చూస్తారు. లేకపోతే మీరే చూడరు. మీరు అలాగే ఉండాలి. మీకోసం మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈసారి పండగకు గట్టిగా కొట్టబోతున్నాం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత మీదే’’ అనే మాటల్తో మహేష్ అభిమానులను ఆకాశానికి ఎత్తేశాడు.

నేను ఒకసారి కమిట్ అయితే స్టోరీ ఒప్పుకుంటే దానికోసం ప్రాణం పెట్టి పని చేస్తా. నా డైరెక్టర్లు నాకు దేముళ్లతో సమానం. అలా నమ్మి పని చేసినందుకే ఒక అతడు వచ్చింది. ఒక పోకిరి వచ్చింది. ఒక శ్రీమంతుడు వచ్చింది.. ఒక ఒక్కడు వచ్చింది. నేను అలా నమ్మబట్టే ఈ స్థాయికి వచ్చా

పదేళ్ల క్రితం పోకిరి తీసిన టైంలో డైరెక్టర్ మురగదాస్ ను కలిశా. అప్పటినుంచి ఆయనతో సినిమా చేద్దామనుకుంటున్నా. పదేళ్లు పట్టింది. మురుగదాస్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఇప్పుడు ఆయనతో కలిసి సినిమా చేయడం నా అదృష్టం. ద్విభాషా చిత్రం చేయడం అంత తేలిక కాదు. ఒక షాట్ కు అనేక రిహార్సల్స్ చేసి ఒక షాట్ తెలుగులో.. ఇంకో షాట్ తమిళంలో ఇలా తీసుకుంటూ రావడం ఎవరూ చేయలేరు. ఇదంతా ఒక సినిమాను రెండుసార్లు తీయడమే. నాకు తెలిసిన ఇంత పర్ ఫెక్ట్ గా ద్విభాషా చిత్రం చేయలేదు. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లే ఏడాదిన్నరపాటు ఉత్సాహం తగ్గకుండా సినిమా చేయగలరు. పోకిరి సమయంలో మురుగదాస్ లో ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడూ అంతే ఉంది. ఆయన పాపులారిటీ ఇప్పుడు బాగా పెరిగింది. అంతే తేడా.. హ్యాటాఫ్’’ అంటూ మురుగదాస్ ను ప్రశంసలతో ముంచెత్తేశాడు ప్రిన్స్.

స్పైడర్ లాంటి సినియా తీయాలంటే ప్యాషన్ తో పాటు గట్స్ ఉండాలి. అది ఉంది కాబట్టే ఈ సినిమా తీయగలరు. నిర్మాతలు ప్రసాద్ అండ్ మధు మామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడి పనిచేయాలో అంత కష్టపడి సినిమా చేశాం.

చిన్నప్పుడు మద్రాసులో దళపతి - రోజా సినిమాలు చూశా. వాటి సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్. హీరో అయ్యాక ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నా. చాలాసార్లు ఆయనతో చేయాలని ప్రయత్నించా. కుదర్లేదు. ఆయనకు నచ్చితేనే సినిమా చేస్తాడు. ఆయనతో కలిసి పనిచేయాలన్న నా కల స్పైడర్ తో తీరింది.

ఎస్.జె.సూర్యతో డైరెక్టర్ గా పనిచేశా. మళ్లీ ఇప్పుడు విలన్ గా ఈ సినిమాలో నటించాడు. ఈ ఏడాదిన్నరలో నా ఎనర్జీ లెవెల్స్ తగ్గాయేమో కానీ ఆయనలో మాత్రం తగ్గలేదు. సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ గురించి పెద్దగా మాట్లాడరు. హ్యారిస్ జైరాజ్ సినిమాలకే మాట్లాడతారు. ఆయన ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు అంటూ మహేష్ సినిమా అందరి కష్టాన్ని పేరుపేరునా ప్రస్తావించాడు.

అందరి గురించి చెప్పిన మహేష్ హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించి మరిచిపోయి చివరిలో నాలుక కరుచుకున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,