Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2017 12:28:38
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్.. బాలీవుడ్ లలోనూ క్రేజ్ ఏర్పడింది. అయితే.. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం షూటింగ్ అనుకున్న సమయం కంటే ఎక్కువగానే పట్టింది. ఈ ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ చేయాలన్నది తొలి ఆలోచన కాగా.. ఫస్ట్ లుక్ ఇవ్వడానికే సమ్మర్ వరకూ పట్టేసింది. దీంతో ఈ సినిమా ప్రోగ్రెస్.. రిలీజ్ పై అభిమానుల్లో నిరుత్సాహంతో పాటు ఆతృత కూడా కనిపించింది.

ఎట్టకేలకు ఈ సినిమాకు అన్ని పనులు పూర్తయిపోతున్నాయి. స్పైడర్ గా నామకరణం చేసిన ఈ చిత్రానికి.. తాజాగా టాకీ పార్ట్ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు ప్యాచ్ వర్క్ ను కూడా పూర్తి చేసేసినట్లు దర్శకుడు మురుగదాస్ అఫీషియల్ గా ట్వీట్ చేశాడు. అంతే కాదు.. షూటింగ్ స్పాట్ కు సంబంధించిన కొన్ని పిక్స్ ను అర్ధరాత్రి సమయంలో నెట్ లో పెట్టేసి.. సూపర్ స్టార్ అభిమానుల నిద్ర చెడగొట్టేశాడు. మహేష్ ను కొత్త లుక్స్ లో చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

ఇప్పుడు స్పైడర్ కు సంబంధించి కొన్ని పాటలు మినహా.. టాకీ షూటింగ్ అంతా పూర్తయిపోయింది. మరోవైపు ఇప్పటికే గ్రాఫిక్స్ పనులు కూడా శరవేగంగా జరనుండగా.. జూలైలో పాటల చిత్రీకరణ చేయనున్నారు. అన్ని పనులను పూర్తి చేసి.. దసరానాటికి అంటే సెప్టెంబర్ చివరి వారంలో స్పైడర్ ను దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.

,  ,  ,  ,  ,