Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-May-2017 16:51:22
facebook Twitter Googleplus
Photo

మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న స్పైడర్ కు ఇంకా గుమ్మడికాయ కొట్టకుండానే కొరటాల శివ డైరెక్షన్లో కొత్త సినిమా భరత్ అను నేను సినిమాకు శ్రీకారం చుట్టేశాడు మహేష్ బాబు. ఈ సినిమా ఘనమైన ప్రారంభోత్సవాల్లేంటివేమీ లేకుండా సింపుల్ గా ముహూర్త కార్యక్రమం కానిచ్చేసి రెగ్యులర్ షూటింగుకి వెళ్లిపోవడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ వేసుకున్నారు. స్పైడర్ కోసం చాలా టైం తీసుకున్న మహేష్.. కొరటాల సినిమా విషయంలో అలా జరగకూడదని అప్రమత్తం అవుతున్నాడు. అనుకున్న ప్రకారమే సంక్రాంతికి భరత్ అను నేనును విడుదలకు సిద్ధం చేస్తే అభిమానులకు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు.

ఐతే కొరటాల సినిమా కంటే ముందు మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి సినిమాకు కమిటైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు నిర్మాత ఎవరనే విషయంలో కొంత తర్జన భర్జన నడిచింది. చివరికి పీవీపీ నుంచి ఈ సినిమాను దిల్ రాజు.. అశ్వనీదత్ తీసుకున్న సంగతి తెలిసిందే. పీవీపీతో వంశీ వివాదాన్ని కూడా సెటిల్ చేసేశారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోపు ఈ సినిమాకు సంబంధించి జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం మహేష్ బాబు తండ్రి.. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును వేదికగా చేసుకోబోతున్నారు. ఈ నెల 31న కృష్ణ జన్మదిన కానుకగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందట. ఆ సందర్భంగా మహేష్ కొత్త లుక్ తో ఒక పోస్టర్ లాంచ్ చేస్తారట.

,  ,  ,  ,  ,