Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2016 10:58:15
facebook Twitter Googleplus
Photo

ప్రతీ హీరోకి ఓ రేంజ్ ఉంటుంది. యంగ్ హీరోల్లో టాప్ రేంజ్ ఎవరిదంటే.. మొదటగా వినిపించే పేరు నితిన్. మధ్యలో కొన్నాళ్లు వెనకబడ్డా.. మళ్లీ ఫాంలోకి వచ్చి.. కనీసం 20 కోట్ల కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నాని - సాయిధరం తేజ్ లు కూడా ఈ రేంజ్ వసూళ్లను స్టడీగా సాధించే రేంజ్ కి చేరినా.. ఈ స్థాయికి చేరుకున్న మొదటి యంగ్ హీరో నితిన్. తనకు కాంపిటీషన్ వచ్చేయడంతో.. ఇప్పుడు తన రేంజ్ ని మరో మెట్టు ఎక్కించేందుకు నితిన్ సిద్ధమయ్యాడు.

త్రివిక్రమ్ తో చేసిన అ..ఆ.. చిత్రం తనను స్టార్ హీరో చేసేస్తుందని ఈ కుర్రహీరో బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు కూడా. నితిన్ రేంజ్ ఈ సినిమాతో ఏ మేరకు పెరుగుతుందనే అంచనాలకు.. ఇప్పుడు అ..ఆ.. శాటిలైట్ రైట్స్ తో ఓ స్థాయి వరకూ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకూ నితిన్ కెరీర్ లో అత్యధికంగా శాటిలైట్ రేటు పలికిన చిత్రం చిన్నదాన నీకోసం. దీనికి 4.5 కోట్ల మేర రేటు వచ్చింది. ఇప్పుడా రికార్డ్ బ్రేక్ అయిపోయింది.

నితిన్- సమంత జంటగా నటించిన అ..ఆ.. చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం కావడంతో.. శాటిలైట్ విషయంలో గట్టిపోటీనే ఏర్పడింది. అయితే.. చివరకు జీ తెలుగు ఛానల్.. 6.07 కోట్లు చెల్లింది ఈ హక్కులను దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. శాటిలైట్ విషయంలోనే తన రేంజ్ ని పెంచుకున్న నితిన్.. థియేట్రికల్ వసూళ్లలోనూ ఇదే సీన్ రిపీట్ చేస్తాడనే అంచనాలున్నాయి.

,  ,  ,  ,  ,  ,