Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2015 12:46:49
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు ఇటీవల చిత్ర నిర్మాణంపై కూడా దృష్టి పెట్టిన వైనాన్ని మనం చూస్తున్నాం. తమ కుటుంబానికి ఓ బ్యానర్ ఇప్పటికే ఉన్నప్పటికీ, జి.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆయన సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ను కూడా నెలకొల్పారు. ప్రస్తుతం ఈ బ్యానర్ పై ఆయన 'శ్రీమంతుడు', 'బ్రహ్మోత్సవం' చిత్రాలకు కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నిర్మాతగా తన కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో కలసి చిత్ర నిర్మాణాన్ని చేబట్టడానికి రెడీ అవుతున్నారని, వీరి నిర్మాణంలో త్వరలో ఓ చిత్రం రానుందని ఫిలిం నగర్ సమాచారం.

,  ,  ,  ,