Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Sep-2016 12:05:21
facebook Twitter Googleplus
Photo

టైటిల్ చూసి జనతా గ్యారేజ్ లో మహేష్ బాబు ఉండడం ఏంటి అనుకుంటున్నారా..అసలు విషయం ఏంటి అంటే..జనతా గ్యారేజ్ కోసం హైదరాబాద్ లోని సారధి స్టూడియో లో జనతా సెట్ వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సెట్ ను ఇప్పుడు మహేష్ బాబు వాడుకోబోతున్నాడట.

మహేష్ బాబు ? మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం, ఈ మధ్యనే చెన్నైలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అయితే తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకునేందుకు ప్లాన్ చేసాడు. ఎన్టీఆర్ కోసం వేసిన సెట్ లోనే కొన్ని మార్పులు చేసి మహేష్ సినిమా షూటింగ్ జరుపుకోబోతున్నారు. ఓ యాక్షన్ పార్ట్ తో పాటు, ఓ పాటను కూడా ఇక్కడే చిత్రీకరించనున్నారని సమాచారం. మహేష్ సరసన రకుల్ ప్రీతీ సింగ్ నటిస్తుండగా , హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,